Reading Time: < 1 minute

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్ నెలకొంది. మాజీ ఎంఎల్ఎ, వైసిపి నేత కేతిరెడ్డి, టిడిపి నేత జెసి ప్రభాకర్‌రెడ్డి మధ్య సవాళ్లకు ప్రతిసవాళ్లు విసురుకున్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు కేతిరెడ్డి సవాల్ విసిరారు. కేతిరెడ్డి ఇంటి ముట్టడికి జెసి వర్గీయుల పిలుపునిచ్చారు. శుక్రవారం కేతిరెడ్డి ఇంటి దగ్గర చర్చకు రెడీ అని జెసి వర్గం తెలిపింది. జెసి వర్గీయులు రాళ్లు డంప్‌ చేశారని కేతిరెడ్డి ఆరోపణలు చేశారు. తాడిపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు.