
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడిల ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. అర్చ న సమర్పించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “పవన్ కళ్యా ణ్ మా చిత్రాన్ని అభినందించడం చాలా ఆనందాన్నిచ్చింది. అలాగే ఇండస్ట్రీలో డైరెక్టర్లు, హీరోలు చాలామంది ఫోన్ చేశారు, మెసేజ్‌లు పెట్టారు. ఈ సక్సెస్‌ని మాతో పా టు ఇండస్ట్రీ సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. -ఈ సినిమా కోసం చిరంజీవి ఫస్ట్ ఫోటో షూట్ చేయగానే లుక్ చూసి అద్భుతంగా అనిపించింది. చాలా గ్లామర్ గా ఉన్నారు. సన్నబడిపోయారు. ఈ లుక్ సినిమా అంతా ఉంటే ఆడియన్స్ ఈ లుక్‌కి ఫిదా అయిపోతారు అనిపించింది.
ఆయన లుక్, స్క్రిప్ట్, టైమింగ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కుదిరాయి. వింటేజ్ చిరంజీవిని చూసి అందరూ మైమరచిపోయారు. -చిరంజీవి, వెంకటేష్ కలిసి కనిపించబోతున్నారంటే కచ్చితంగా చాలా అంచనాలు ఉంటాయి. అందరికీ నచ్చేలా చూపించడం కూడా పెద్ద టాస్క్. అయితే చిరంజీవి, వెంకటేష్ మధ్య ఉన్న స్నేహం వల్ల నా పని సులభమైంది. థియేటర్స్ లో చిరంజీవి, వెంకటేష్ సీన్స్‌ను చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలో శంకర్ వరప్రసాద్ క్యారెక్టర్ జర్నీ చూపిద్దాం అనుకున్నాను. అయితే శశిరేఖ లవ్ ట్రాక్ మాత్రం ముందు స్క్రిప్ట్‌లో మధ్యలో వస్తే బాగుంటుంది అనుకున్నాను. కానీ స్క్రీన్ ప్లే ప్రకారం అది ప్రారంభంలోనే వస్తేనే ఇంకా కనెక్టింగ్‌గా ఉంటుందని దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అది ఇంకా అద్భుతంగా వర్కవుట్ అయ్యింది. మందు సీన్స్‌లో చిరంజీవి చేసే మ్యానరిజమ్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఆ సీక్వెన్స్ వెంకటేష్, ఆయనకి మధ్య ఉండే కనెక్షన్‌ని కూడా బయటపెడుతుంది. అది థియేటర్లో అద్భుతంగా పేలింది.
-అభిమానుల స్పందన మాటల్లో చెప్పలేను. నన్ను చూసి చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎన్నో సంవత్సరాల నుంచి చిరంజీవిని ఇలా చూడాలని వాళ్లు కోరుకున్నారు. ఈ సక్సెస్ ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. థియేటర్స్‌లో ఆడియన్స్‌ని చూస్తున్నప్పుడు ఒక జాతర లాగా అనిపించింది. అన్ని వయసుల ప్రేక్షకులు ఈ సినిమాని సెలెబ్రేట్ చేసుకున్నారు. -థియేటర్స్‌లో ఆడియన్స్ నవ్వుతున్నంత సేపు వాళ్ళ చిరునవ్వే నాకు ఎనర్జీ. రాజమౌళి తర్వాత వరుసగా తొమ్మిది విజయాలు అందుకున్న దర్శకుడిగా రికార్డు సృష్టించడం ఆనందంగా ఉంది. నా పదో సినిమాకి ఒక ఐడియా వచ్చింది. ఈసారి టైటిల్ ప్రకటన నుంచి ఒక విచిత్రమైన జర్నీ ప్రారంభం కాబోతోంది. స్టోరీ లైన్ ఫిక్స్ అయ్యాను. ఇంకా నటులు ఫిక్స్ కాలేదు. జూన్, జూలైలో సినిమా ప్రారంభించాలి. అది కూడా మంచి ఎంటర్‌టైనర్. ఇక దర్శకుడిగా రాజమౌళి చేసే సినిమాలు వేరు. నేను చేసే సినిమాలు వేరు. డైరెక్టర్‌గా ఆయన ఎంతో ఎత్తున ఉన్నారు. ఆయన నాకు ఇష్టమైన దర్శకుడు. నేను ఇప్పుడే ప్రయాణాన్ని మొదలు పెట్టాను. ఇంకా ఎంతో దూరం ప్రయాణించాలి. భీమ్స్‌తో మ్యూజిక్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. తను సినిమా కోసం ఎన్ని వర్షన్స్ అయినా చేస్తాడు. ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడి పని చేశాడు”అని అన్నారు.