
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణకు చెందిన 16 మంది రెవెన్యూ అధికారులకు కేంద్రం ఐఏఎస్‌లుగా హోదా కల్పించడం వివాదాస్పదంగా మా రింది. వీటి వెనుక పెద్ద మొత్తంలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. హోదా దక్కిన వారిలో కొందరిపై ఈడి, విజిలెన్స్, ఎసిబి, ఫోర్జరీ కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడం పట్ల సీనియర్ ఐఏఎస్ అధికారులు విస్తుపోతున్నారు. ఐఏఎస్ హోదాకు సిఫార్సునకు 56 సంవత్సరాల వయసు దాటకూడదన్న ప్రాథమిక నిబంధనను కూడా పరిగణనలోకి తీసుకోకపోవడంపై సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. యూపిఎస్సీ నిబంధనలను పాటించకుండా పలువురికి ఐఏఎస్ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాద న పంపించినప్పటి నుంచి డిఓపిటి, యూపిఎస్‌సి వరకు అన్ని చోట్ల అతిక్రమణలు జరగడం వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు అధికార వర్గా ల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు వారికి ఐఏఎస్ హోదా కల్పించే అంశంలో తమకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై అర్హులు కొందరు హైకోర్టుసు ఆశ్రయిం చగా ప్రస్తుతం ఆ కేసు పెండింగ్‌లో ఉంది.
ఇ లా ఉండగా, రాష్ర్ట ప్రభుత్వం పంపించిన జాబితాకు నిబంధనలను పరిగణనలోకి తీసుకోలేదని దానిని ఆమోదించవద్దని సుప్రీంకోర్టు న్యాయవాది మనీ ష్ తివారీ ఆధారాలతో సహా యూపిఎస్సీ లేఖ రాశారు. అయినప్పటికీ ఆ లేఖ ను యూపిఎస్సీ పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చే సే అవకాశం ఉన్నట్టు తాజా సమాచారం. ప్రస్తుతం ఐఏఎస్ హోదాకు ఎంపికైన వారిలో కొందరిపై హైకోర్టుల్లో కేసులు, మరికొందరిపై ఈడి, విజిలెన్స్, ఎసిబి కేసులు,అవినీతి ఆరోపణలు ఉండగా వారికి ఎలా హోదా కట్టబెడుతారని, పెండింగ్ కేసులు తేలకుండానే డిఓపిటి ఏ విధంగా ఆమోదించిందని ప్ర శ్నిస్తున్నారు. ఇవే కాకుండా ఉద్యోగంలో చేరినప్పటి (జాయినింగ్ రిపోర్టు) రి కార్డులో ఒకరకంగా యూపిఎస్సీకి చేసుకున్న దరఖాస్తులో మరోరకంగా ట్యాంపరింగ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కనీసం వాటిపై ఆధారాలతో స హా వచ్చిన ఫిర్యాదు కూడా యూపిఎస్సీ పరిశీలించకుండానే వారికి హోదా ఎ లా కట్టబెట్టారో అర్థం కావడం లేదని రిటైర్టు ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారుల్లో 16 మంది అధికారుల కు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) హోదా కల్పిస్తూ కేంద్ర సిబ్బం ది, శిక్షణ శాఖ (డిఓపిటి) బుధవారం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ అధికారుల కేసుల డేటాను కొందరు బయటకు తీస్తున్నారు. మరి కొందరు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సన్నద్ధం అవుతున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ అంశం చర్చనీ యాంశంగా, వివాదాస్పదంగా మారింది.
56 సంవత్సరాలు దాటినప్పటికీ జాబితాలో పేరు&
ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ఈ ఐఏఎస్‌ల హోదాపై రిట్ పిటిషన్ (డబ్లూపి నెంబర్ 32415/2023) కేసు పెండింగ్‌లో ఉంది. దీంతోపాటు 2022 నుంచి 2024 వరకు ఐఏఎస్‌ల పదోన్నతలకు సంబంధించి డిప్యూటీ కలెక్టర్‌లుగా ఉన్న సమయంలో యూపిఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున జాబితాను పంపించారని, ఆ సమయంలో డిప్యూటీ కలెక్టర్‌ల సీనియారిటీ జాబితా ఫైనల్ కాలేదని, ఫైనల్ సీనియార్టీ జాబితాను సిసిఎల్‌ఏ ప్రకటించకుండానే యూపిఎస్సీకి ఆ జాబితా చేరిందని, ఈ విషయమై తాము చేసిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని దీనిపై పూర్తి విచారణ జరపాలని యూపిఎస్సీకి రాసిన లేఖలో అడ్వకేట్ మనీష్‌తివారీ కోరారు. అయితే, 2022, 2023, 2024 సంవత్సరాలకు సంబంధించి యూపిఎస్సీకి పంపించిన జాబితాలో 56 సంవత్సరాలు దాటిన డిప్యూటీ కలెక్టర్‌ల పేర్లు కూడా ఉన్నాయని అది యూపిఎస్సీ నిబంధనలను విరుద్ధమని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై క్యాట్‌లో కొందరు ఫిర్యాదు చేయడం విశేషం.
డిప్యూటీ తహసీల్దార్‌గా నియామకం అయిన వారికే….
2011 తరువాత గ్రూప్ 1 నియామకాలను అప్పటి ప్రభుత్వాలు నిర్వహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 2024, 25లో గ్రూప్ 1 పరీక్షను నిర్వహించి 563 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందించింది. అయితే, గ్రూప్ 1 అభ్యర్థులతో పాటు రెవెన్యూ శాఖకు చెందిన అధికారులకు ఐఏఎస్‌గా పదోన్నతి లభిస్తోంది. (ఉదా…రాష్ట్రానికి సంబంధించి మూడు పోస్టులు ఐఏఎస్‌లు ఖాళీగా ఉంటే 2 పోస్టులు రెవెన్యూ 1 పోస్టు గ్రూప్1కు కేటాయిస్తారు). అయితే, ప్రస్తుతం రెవెన్యూ కోటాలో 20 పైచిలుకు ఐఏఎస్‌లు ఖాళీ ఉండగా, అందులో ఈ సారి 16 మందికి ఐఏఎస్‌లుగా పదోన్నతి కల్పించారు. ఈ 16 మందిలో 1995 సంవత్స రానికి సంబంధించి గ్రూప్ 2 ఏ కింద 14 మంది డిప్యూటీ తహసీల్దార్‌లుగా ఉద్యోగంలో చేరగా, ఒకరు డిప్యూటీ కలెక్టర్‌గా, మరొకరు గ్రూప్ 2 బి సర్వీసు కింద ఉద్యోగంలో చేరారు. ఈ 16 మంది 2011లో డిప్యూటీ కలెక్టర్‌లుగా పదోన్నతి పొందారు.
2022, 2023, 2024 సంవత్సరంలో ఏర్పడిన ఖాళీల ఆధారంగా
తాజాగా 2022, 2023, 2024 సంవత్సరాల్లో ఏర్పడిన ఖాళీలకు అనుగుణంగా 16 మందికి ఐఏఎస్‌లు పదోన్నతిని కల్పించారు. రాష్ట్రం నుంచి ఒకేసారి 16 మందికి ఐఏఎస్‌లుగా పదోన్నతి లభించడం ఇదే మొదటిసారి. 2019 నుంచి 2021 వరకు రెవెన్యూ కోటా పదోన్నతులకు ఖాళీలు భర్తీ కాలేదు. దీంతోపాటు 2022లో 11 ఖాళీలు, 2023లో మూడు ఖాళీలు, 2024లో రెండు ఖాళీలు ఏర్పడడంతో మొత్తం 16 మందికి పదోన్నతులను డిఓపిటి కల్పించింది.