Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: ఆరోపణలు, ప్ర త్యారోపణలతో తీవ్ర వివాదం తలెత్తిన నైనీ కోల్ బ్లాక్ టెండర్ల అంశంపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగింది. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దుకు దారితీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ వి చారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ త్వరలోనే తెలంగాణలో పర్యటించనుంది. ఈ మేరకు విచారణ అధికారులుగా కేంద్ర బొగ్గు శాఖ డిప్యూటీ డైరక్టర్ జనరల్ చేతనా శుక్లా, టెక్నికల్ డైరక్టర్ మారపల్లి వెంకటేశ్వర్లును నియమిస్తూ అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల అంశంలో పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు రావడంతో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి బొగ్గు శాఖకు ఇ చ్చిన ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించింది. ఈ వివాదానికి, టెండర్ రద్దు చేయడానికి ఉన్న కారణాలు సహా ఇతర అంశాలపైనా సింగరేణి అధికారులతో కలిసి ఈ బృందం దర్యాప్తు చేస్తుందని అధికార వర్గాల సమాచారం. ఈ బృం దం దర్యాప్తు చేపట్టి నివేదిక అందించేందుకు కేంద్ర బొగ్గు శాఖ మూడు రోజుల సమయం కేటాయించింది. రాష్ట్రానికి వచ్చిన మూడు రోజు ల్లో సింగరేణిలో పర్యటించి నైనీ బొగ్గు గనుల టెండర్ రద్దుకు గల కారణాలపై విచారణ జరిపి ఆ నివేదికను కేంద్రానికి అందజేయాలని ఆదేశించింది. గత ఏడాది నవంబర్ 28న ఒడిశాలోని నైనీ ప్రాంతంలో సింగరేణికి

ఉన్న నైనీ కోల్ బ్లాక్‌లో బొగ్గు తవ్వకానికి సంబంధించి సింగరేణి సంస్థ నోటిఫికేషన్ జారీ చేసి ఆ తర్వాత దాన్ని రద్దు చేసింది. ఇలా ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందనే అంశంపై కమిటీ దర్యాప్తు చేస్తుంది. ఇదిలావుంటే ఇదే అంశంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ ఈ నెల 21నే సింగరేణి సంస్థను వివరణ కోరింది. ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లోని బొగ్గుగనుల కార్యాలయంలో ఆ శాఖ సంయుక్త కార్యదర్శి కె.సంజీవ్కుమార్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నైనీ బొగ్గు గని టెండర్లపై సమీక్షించారు. ఈ సమీక్షలో నైనీ బొగ్గు గని టెండర్ల విషయంలో సంస్థ విధించిన నిబంధనలపై పాలకమండలి ముందే లోతుగా ఎందుకు చర్చించలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే ఒకవేళ చర్చించి ఉంటే ఇప్పుడు అవినీతి, ఆరోపణలు ఎందుకు ఆస్కారం కలిగిందని వీడియో కాన్ఫెరెన్స్‌లో ప్రశ్నించినట్లు సమాచారం. ఇంకా పలు అంశాలపై సూటిగా ప్రశ్నించిన తర్వాత క్షేత్రస్థాయిలో కమిటీని నియమించి పరిశీలించిన తర్వాతే సమగ్ర నివేదికను తీసుకునేందుకు కేంద్ర బొగ్గు శాఖ నిర్ణయం తీసుకుని ఇద్దరు అధికారులతో కూడిన కమిటీని నియమించింది. దీంతో కమిటీ ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రాన్ని సందర్శించే అవకాశం ఉంది.