
న్యూక్: గ్రీన్‌లాండ్ అమెరికాకు కావల్సిందేనని ట్రంప్ ప్రకటించడంతో గ్రీన్‌లాండ్‌లో కలవరం చెలరేగింది. అక్కడి ప్రభుత్వం పౌరులకు అత్యవసర జాగ్రత్త చర్యలకు సమాయత్తం చేసింది. పౌరులు చాలినంతగా ఆహారం, మంచి నీరు, ఇంధనం వంటి నిత్యావసరాలతో సిద్ధంగా ఉండాలని ఇంగ్లీషు, స్థానిక గ్రీన్‌ల్యాండిక్ భాషలో కరపత్రం వెలువరించారు. తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలిపారు. సంక్షోభం ఏర్పడుతుందని తెలిపారు. పలు ప్రాంతాల్లో పౌరులు దుకాణాలకు వెళ్లి తమకు అవసరం అయిన వస్తువులు కొనుకుంటున్నారు.
గ్రీన్‌లాండ్‌ను ఏదో విధంగా స్వాధీన పర్చుకోవడమే ట్రంప్ తంతు అన్పిస్తోందని స్దానిక పౌరుడు జాకోబ్‌సెన్ మండిపడ్డారు. ప్రపంచ స్థాయి సదస్సు నుంచి ట్రంప్ ప్రేలాపనలు తమక సహించలేని విధంగా ఉన్నాయని నిరసన వ్యక్తం చేశారు. ట్రంప్‌వి బెదిరింపులే కావచ్చు. అయితే మనం అంతా సిద్ధంగా ఉండకుండా వ్యవహరించడం కన్నా సిద్ధంగా ఉండటం మంచిదని తెలిపారు.