Reading Time: < 1 minute

హైదరాబాద్: నైనీ కోల్ బ్లాక్ లో మైనింగ్ చేయలేమని సింగరేణితో అప్పటి ప్రభుత్వం బలవంతంగా లేఖ రాయించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి డైరెక్టర్లకు ఆ కమిటీ రిపోర్టును వివరించానని, అప్పటికి ఇంకా నైనీ బ్లాక్ ఇష్యూ లేదని అన్నారు. ఆ కుటుంబం పెత్తనం చేసిందో అందరికీ తెలుసు అని.. బిఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి సింగరేణిని కష్టాల్లో పడేశాయని విమర్శించారు. దివంగత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో బొగ్గు కుంభకోణాలు జరిగాయని, సింగరేణిపై కేంద్ర ప్రభుత్వం అజమాయిషీ ఎప్పుడూ లేదని కిషన్ రెడ్డి తెలియజేశారు.

సింగరేణిలో ఖర్చు తగ్గించేందుకు గతంలోనే ఒక కమిటీ వేశామని, రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. బిఆర్ఎస్ సింగరేణిలో ఆర్థిక విధ్వసంసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందని మండిపడ్డారు. టెండర్ దాఖలకు ఈ నెల 29 వరకు టైమ్ ఉందని, గతంలో తాడిచెర్ల కోల్ బ్లాక్ ను కేంద్రం జెన్ కోకు కేటాయించిందని అన్నారు. కంపెనీకి ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదని..నైనీ బ్లాక్ లో ఇప్పటి వరకు 17 కంపెనీలు ఫీల్డ్ విజిట్ చేశాయని పేర్కొన్నారు. సింగరేణి బోర్డు నామమాత్రమేనని, మాజీ సిఎం కెసిఆర్ కుటుంబమే అంతా చేసిందని ధ్వజమెత్తారు. ఒడిశా ప్రభుత్వాన్ని ఒప్పించి నైనీని అప్పగించామని, తెలంగాణలోకి సిబిఐ రాకుండా నిషేదించింది బిఆర్ఎస్ కాదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.