Reading Time: < 1 minute

ముంబయి: ప్రముఖ గాయని ఎస్ జానకి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. జానకి తనయుడు మురళీకృష్ణ(65) గురువారం కన్నుమూశారు. మురళీ చనిపోవడంతో షాక్‌కు గురయ్యానని ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. భరతనాట్యంలో మురళీకి ప్రావీణ్య ఉంది. తెలుగు, మలయాళీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తెలుగులో వినాయకుడు, మల్లెపువ్వు వంటి సినిమాలో నటించారు. కూలింగ్ గ్లాస్ అనే మలయాళ చిత్రానికి రచయితగా పని చేశారు. గతంలో జానకి ఆరోగ్యంపై మీడియా వార్తలు రావడంతో మురళీ ఖండించారు. మురళీ తుదిశ్వాస విడవడంతో భార్య, ఇద్దరు కూతుళ్లు, తల్లి శోకసంద్రంలో మునిగిపోయారు. సినీ ప్రముఖలు మురళీ మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానిక ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.