Reading Time: < 1 minute

ఆదిలాబాద్: గుంత తొవ్వి అస్థిపంజరం నుంచి తల భాగం తీసుకెళ్లిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చొడ మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇస్లామ్‌నగర్ గ్రామానికి చెందిన లాండ్గె వెంకట్(19) 2024 నవంబర్ నెలలో బావిలో పడి మృతి చెందాడు. అతడి కుటుంబ సభ్యులు పొలంలో అంత్యక్రియలు చేశారు. మౌనీ అమవాస్య రోజు గుంత తొవ్వి అస్థిపంజరం అక్కడి వదిలిపెట్టి తలను(పుర్రె) తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.