Reading Time: < 1 minute

అమరావతి: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉండడంతో భర్తను భార్య ప్రియుడితో కలిసి చంపేసి గుండెపోటుతో మృతి చెందాడని అందరినీ నమ్మించింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చిలువూరుకు చెందిన శివనాగరాజు, లక్ష్మీమాధురి అనే దంపతులు విజయవాడలో నివసిస్తున్నారు. లక్ష్మీ ఓ సినిమా థీయేటర్‌లో టికెట్ కౌంటర్‌లో పని చేస్తోంది. సినిమా హాల్‌లో పని చేసే గోపి పరిచయం కావడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త ఉల్లి వ్యాపారం చేస్తుండడం నామోషీగా బావించి బంద్ చేయించింది. గోపి హైదరాబాద్‌లో కారు ట్రావెల్స్ నిర్వహిస్తుండడంతో ఉద్యోగానికి పంపింది. కొంతకాలం హైదరాబాద్ నుంచి చిలువూరు రావడంతో దంపతుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. నాగరాజు ఇంటి వద్ద వ్యాపారం చేస్తుండడంతో ప్రియుడితో సంబంధానికి అడ్డుగా మారింది.

దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. బిర్యానీలో 20 నిద్ర మాత్రలు కలిపి భర్త భోజనం పెట్టింది. అతడు గాఢనిద్రలోకి జారుకున్న తరువాత ప్రియుడితో కలిసి ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఫోర్న్ వీడియోలు చూసుకుంటూ కాలం గడిపింది. తెల్లవారుజామున తన భర్త గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించింది. ఇరుగుపొరుగువారికి అనుమానం రావడంతో నాగరాజు స్నేహితులు అక్కడి వచ్చి మృతదేహాన్ని గమనించారు. చెవులో రక్తం ఉండడంతో పాటు ఇరుగుపొరుగువారు గుసగుసలాడడంతో అనుమానం వచ్చింది. నాగరాజు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఊపిరాడక చనిపోవడంతో పాటు నిద్ర మాత్రలు మింగినట్టు తేలింది. దీంతో భార్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకుంది. వెంటనే ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.