Reading Time: < 1 minute

అమరావతి: ఓ ప్రైవేటు బస్సు టైర్ పేలడంతో అదుపుతప్పి డివైడర్ దాటి అవతలి వైపు లారీని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. రెండు వాహనాలు దహనమయ్యాయి. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా శిరివేళ్ల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎఆర్‌బిసివిఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు 36 మంది ప్రయాణికులతో నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తోందిజ శిరివెళ్లమెట్ట వద్ద రాగానే బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అనంతరం లారీని ఢీకొట్టింది.

ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లారీ డ్రైవర్, బస్సు డ్రైవర్, క్లీనర్ ఘటనా స్థలంలో సజీవదహనమయ్యారు. ఓ డిసిఎం డ్రైవర్ బస్సు అందాలను పగులగొట్టి ప్రయాణికులను బయటకు లాగాడు. ప్రయాణికులు విండో అందాలు పగుటగొట్టి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రయాణికులు కిటీకిలో నుంచి బయటకు దూకడంతో కొందరు గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికుల లగేజీ మొత్తం కాలి బూడిదగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.