Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు (జిసిసి) ప్రధాన కేం ద్రంగా మారిందని, మూసీ నది పునరుజ్జీవనంతో పాటు రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసి నైట్ టైమ్ ఎకానమీపై దృష్టి పెడతామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా దేశంలోనే 24 గంట లు పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. దావోస్ వేదికపై సిఎం రేవంత్‌రెడ్డి ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను ప్రదర్శిస్తూ 30 వే ల ఎకరాల్లో నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ మూ సీ పునరుజ్జీవనం ద్వారా హైదరాబాద్‌ను 24 గంటలు పనిచేసే నగరంగా మారుస్తామని సిఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభు త్వం ‘తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్’, ‘నెక్ట్‌జె న్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026, -2030’లను అధికారికంగా సిఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరో వినూత్న ప్రతిపాదన ఉంచారు.

ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగష్టు నెలల్లో హైదరాబాద్‌లో ‘మినీ దావోస్’ తరహాలో ఫోరం ఫాలో- అప్ సదస్సును ని ర్వహించాలని సిఎం సూచించారు. పెట్టుబడి ఒ ప్పందాలు, వాణిజ్య నిర్ణయాలకు ఏడాది కాలం చాలా ఎక్కువని, అందుకే ఆరు నెలలకోసారి సమీ క్ష సమావేశం అవసరమని సిఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు పలికారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో 250 బిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఇప్పటికే రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని, రానున్న రో జుల్లో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని సిఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ప్రతి ఏడాది తాము ఎంఓయూలపై సంతకాలు చేయడానికి దావోస్‌కు వస్తామని, కానీ, ఈసారి గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావటంతో, తెలంగాణ రైజింగ్ విజన్, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలను ప్రపంచానికి చూపించడానికి వచ్చామని ఆయన తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇందులో 50 శాతం కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యమెంట్ లక్ష్యాలను ముఖ్యమంత్రి ప్రదర్శించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు హైదరాబాద్ లో మెట్రో రైలు విస్తరణ, చెరువులు, కుంటల పునరుజ్జీవనం వంటి గేమ్-చేంజర్ ప్రాజెక్టుల గురించి పెట్టుబడిదారులకు వివరించారు. కొత్తగా ప్రతిపాదించిన కోర్, ప్యూర్, రేర్ అర్థిక వృద్ధి జోన్ల ప్రణాళికల గురించి వారిద్దరూ ప్రస్తావించారు. తెలంగాణకు అపారమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, సాంకేతికత, అనుభవం, నైపుణ్యాల పరంగా గ్లోబల్ కంపెనీల సహకారం స్వీకరిస్తామని వారు పేర్కొన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా సినీ నటుడు చిరంజీవి

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు హాజరైన ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి సినీ నటుడు చిరంజీవి విందులో పాల్గొన్నారు. సినీ నటుడు చిరంజీవి అక్కడే ఉన్న జ్యూరిక్ లో ఉన్నారని తెలుసుకున్న సిఎం రేవంత్ ఆయన్ను కూడా ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఆహ్వానించారు. ఈ సదస్సులో ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను చిరంజీవి ఆసక్తిగా వీక్షించారు. అనంతరం ఆయనతో సిఎం రేవంత్ మాట్లాడుతూ కుటుంబంతో కలిసి ‘మన శంకరవరప్రసాద్’ సినిమా చూశానని, చాలా బాగుందని సిఎం రేవంత్ ప్రశంసించారు. ఈ సందర్భంగా చిరంజీవికి అభినందనలు తెలిపారు. కాగా, ప్రస్తుతం చిరంజీవి స్విట్జర్లాండ్ లో ఫ్యామిలీ ట్రిప్‌లో ఉన్నారు.