Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: అవినీతి నిరోదకశాఖకు ఇప్పటికే చిక్కిన హన్మకొండ జిల్లా అ దనపు కలెక్టర్ అర్ర మాడ వెంకట్ రెడ్డికి వంద కోట్లకు పైనే ఆస్తిపాస్తులు ఉన్నట్టు తాజాగా ని ర్వహించిన సోదాలలో బయటపడింది. హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేసిన వెంకటరెడ్డి అవినీతి చిట్టా మరోసారి ఎసిబి ని ర్వహించిన సోదాలలో గుర్తించింది. బుధవా రం తెల్లవారుజామున హైదరాబాద్, రంగారె డ్డి, వరంగల్, నల్గొండ, మిర్యాలగూడ తదితర ప్రాంతాల్లోని ఆయన ఇళ్లు, బంధువుల ఇళ్లల్లో ఎసిబి బృందాలు ఏకకాలంలో సోదా లు నిర్వహించాయి. ఈ సోదాల్లో ఆయన ఆస్తుల విలు వ ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం వంద కోట్ల కు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఎసిబి గుర్తించింది. రిజిస్ట్రేషన్ విలువ మేరకు ఎల్బీనగర్‌లో రూ.4.6 కోట్ల విలువ చేసే భవనం, ఒక ఖరీదైన విల్లాతో పాటు అదే ప్రాంతాల్లో రూ.60 లక్షల విలువ చేసే కమర్షియల్ షాప్, రూ.65 లక్షల చొప్పున విలువ చేసే ఎనిమిది ఓపెన్ ప్లాట్‌లు, రూ.50 లక్షల విలువ చేసే 14.25 ఎకరాల వ్యవసాయ భూమి కలిగి ఉన్నట్టు ఎసిబి గుర్తించింది. వీటి విలువ బహిరంగ మార్కెట్ లో వంద కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటికి సంబంధించిన కీలక పత్రాలను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు విచారణలో భాగంగా వెంకట్ రెడ్డి ఇంట్లో, బ్యాంక్ లాకర్లలో లభించిన నగదు, బంగారం చూసి అధికారులు విస్తుపోయారు. రూ. 30 లక్షల నగదుతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ రూ.44 లక్షలుగా ఎసిబి గుర్తించింది. రూ.11 లక్షల విలువ చేసే గృహోపకరణాలు, రూ.40 లక్షల విలువ చేసే వాహనాలు, రూ.4.35 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను ఎసిబి అధికారులు సీజ్ చేశారు. ఈ ఆస్తులన్నీ తన అధికార హోదాను అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదిం చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా, వెంకట్ రెడ్డి అవినీతి భాగోతం డిసెంబర్ 5న ఒక పాఠశాల రెన్యూవల్ కోసం లంచం అడగటంతో ఈ వ్యవహారంతో వెలుగులోకి వచ్చింది. రెన్యూవల్ ఫైల్ క్లియర్ చేయడానికి ఆయన రూ. 60 వేలు లంచం డిమాండ్ చేయగా అతన్ని ఎసిబి అధికారులకు సమాచారం ఇచ్చి పట్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే వెంకట్‌రెడ్డి సస్పెండ్ కాగా. ప్రస్తుతం ఎసిబి అధికారులు, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఇతర బినామీ ఆస్తులు, పెట్టుబడులపై దృష్టి సారించింది. నల్గొండ జిల్లాలో తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో కూడా వెంకట్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైనట్లు సమాచారం. ఇలా ఉండగా ఈ అక్రమార్జనలో ఇతర అధికారుల పాత్రపై కూడా విచారణ జరుపనున్నట్టు ఎసిబి వర్గాల సమాచారం.

ఎసిబి కేసు నమోదు

హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డిపై ఎసిబి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. వెంకట్ రెడ్డిపై అవినీతి నిరోధక చట్టం 1988 (సవరణ 2018) సెక్షన్ 13(1)(b), 13(2) కింద కేసు నమోదు చేసినట్లు ఎసిబి అధికారులు తెలిపారు.