Reading Time: < 1 minute

హైదరాబాద్ -విజయవాడ హైవే..కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

Caption of Image.

హైదరాబాద్- విజయవాడ రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. క్రిస్మస్ తో పాటు వీకెండ్ కావడం వరుస సెలవులు రావడంతో సొంతూళ్లకు బాటపట్టారు నగర వాసులు. దీంతో  విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర  వాహనాలు నిలిచిపోయాయి.  రోడ్డు విస్తరణతో కొన్ని చోట్ల వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు. ఓఆర్ఆర్ నుంచి విజయవాడ హైవేపై వాహనాలు  నెమ్మదిగా కదులుతున్నాయి. 

చిట్యాల దగ్గర  రోడ్డు పనులు జరుగుతున్నందున  వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.పోలీసులు, NHAI సిబ్బంది ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు. ఫ్లైఓవర్ పనులు నెమ్మదిగా నడుస్తుండటంతో ప్రతి వీక్ ఎండ్ రోజున ప్రయాణికులు  నరకం చూస్తున్నారు.వెహికిల్స్ స్లోగా కదులుతుండటంతో సొంతూళ్లకు ఇంకెపుడు వెళ్తామా అన్నట్టు  ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. చౌటుప్పల్ ఏరియాలో వాహనాలు బారులు తీరాయి. పంతంగి టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో.. ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. 

 

©️ VIL Media Pvt Ltd.