Reading Time: < 1 minute

ఎన్నికల ముందు మరో పహల్గాం దాడి..?: బీజేపీపై మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్

Caption of Image.

తృణమూల్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నికల ముందు మరో పహల్గాం దాడి జరుగుతుందా..? బీజేపీ దగ్గర దానికి సంబంధించి బ్లూప్రింట్ రెడీగా ఉంది.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీదీ చేసిన వ్యాఖ్యలతో బెంగాల్  లో బీజేపీ, తృణమూల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటోంది. విమర్శల, ప్రతివిమర్శలతో బెంగాల్ వీధులన్నీ మార్మోగుతున్నాయి. 

2026 ఏప్రిల్ 06న ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్.. కోక్ కతాను పేల్చేస్తాం అంటూ హెచ్చరించారు. కానీ దీనిపై ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏప్రిల్ 05న బెంగాల్ లోని కూచ్ బెహార్ ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ప్రధాని.. పాక్ బెదిరింపులపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 

కోల్ కతాను టార్గెట్ చేస్తామని పాక్ మంత్రి చెప్పినా.. మోదీ మాట్లాడక పోవడమేంటి..? మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాం.. అని మోదీ ఎందుకు అనలేకపోయారు. దీని ప్లానింగ్ ముందే రెడీ గా ఉందా..? ఎలక్షన్స్ ముందు మరో పహల్గాం దాడికి సిద్ధమయ్యారా..? అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 

సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ ఘాటుగా స్పందించింది. మైనారిటీల ఓటు బ్యాంకు కోసమే మమతా ఈ వ్యాఖ్యలు చేసిందని బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్రదీప్ భండారి విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యాంటీ హిందూ పార్టీ అని ఆరోపించారు. 

©️ VIL Media Pvt Ltd.