Reading Time: 2 minutes

హైవే ఎక్కాలంటే కారు ఉంటే సరిపోదు.. మీ దగ్గర ఆధార్ లాంటి గుర్తింపు కార్డ్ మస్ట్.. ఏప్రిల్ 10 నుంచి కొత్త రూల్స్ ఎందుకు అంటే..!

Caption of Image.

భారతదేశ హైవేలపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. ఏప్రిల్ 10 నుంచి జాతీయ రహదారుల నిర్వహణలో భారీ మార్పులు రాబోతున్నాయి. భద్రతను కట్టుదిట్టం చేయడం, పారదర్శకతను పెంచడం, టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడమే లక్ష్యంగా సరికొత్త రూల్స్ అమల్లోకి తెస్తోంది. ఈ మార్పులు కోట్లాది మంది వాహనదారులు, లారీ డ్రైవర్లు, సుదూర ప్రయాణికులపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ఇకపై హైవేలపై ప్రయాణం అంటే కేవలం వాహనం నడపడమే కాదు.. ప్రభుత్వ నిబంధనలను పక్కాగా పాటించడం కూడా అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

హైవేపై అవసరమైన గుర్తింపు కార్డులు..

ఈ కొత్త నిబంధనల్లో అత్యంత కీలకమైనది ID Card రూల్స్. ఏప్రిల్ 10 నుండి టోల్ ప్లాజాలు లేదా హైవే చెక్ పోస్టుల వద్ద ప్రయాణికులు తమ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఐడీ కార్డును తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. వాహన దొంగతనాలు, స్మగ్లింగ్, అనధికారిక రవాణాను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గుర్తింపు కార్డు లేని పక్షంలో జరిమానా విధించడమే కాకుండా.. ప్రయాణాన్ని నిలిపివేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రయాణానికి ముందే మీ వాలెట్‌లో ఐడీ కార్డు ఉందో లేదో చెక్ చేసుకోవటం బెటర్.

క్యాష్ పేమెంట్స్ బంద్..

మరో కీలక మార్పు క్యాల్ లెస్ టోల్. ఏప్రిల్ 10 నుండి టోల్ బూత్‌ల వద్ద క్యాష్ పేమెంట్స్ పూర్తిగా నిషేధించబడ్డాయి. అన్ని లావాదేవీలు ఫాస్ట్ ట్యాగ్, యూపీఐ, డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే జరగాలని కేంద్రం నిర్థేశించింది. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద చిల్లర సమస్య ఉండదు, ట్రాఫిక్ వేగంగా కదులుతుంది. నగదు మార్పిడిలో జరిగే అవకతవకలను అరికట్టడం కూడా దీని ప్రధాన ఉద్దేశం. ఇంకా ఫాస్ట్ ట్యాగ్ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని.. ఎందుకంటే ఇకపై హైవేలపై క్యాష్ లైన్లు కనుమరుగు కాబోతున్నాయి కాబట్టి.

హైవేపై పెట్రోలింగ్ తనిఖీలు..

వీటితో పాటు వెహికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరింత కఠినతరం కానుంది. ఇన్సూరెన్స్ పేపర్లు, పొల్యూషన్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ వివరాలను హైవే పెట్రోలింగ్ బృందాలు ఎక్కడైనా తనిఖీ చేయవచ్చు. ప్రమాదాలను తగ్గించేందుకు, ఫిట్ నెస్ లేని వాహనాలను అరికట్టేందుకు ఈ చర్యలు చేపడుతున్నారు. ఆధునిక సీసీటీవీ కెమెరాలు, ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ గుర్తింపు వ్యవస్థలు ప్రతి వాహనం కదలికను పర్యవేక్షిస్తాయి. ఈ మార్పులు మొదట్లో కొంత ఇబ్బందిగా అనిపించినా.. దీర్ఘకాలంలో భారత హైవేలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చి, ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, వేగంగా మారుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

సెక్యూరిటీ కెమెరాలతో నిఘా..

టోల్ ప్లాజాలతో పాటు హైవే జంక్షన్ల దగ్గర సర్వేలెన్స్ కెమెరాలతో ట్రాఫిక్ మానిటరింగ్, రోడ్డు సేఫ్టీ రూల్స్ పాటించని వాహనాలను గుర్తించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా తీసుకొస్తున్నారు హైవేలపై సేఫ్టీని పెంచేందుకు. మెుత్తానికి దొంగతనాల నుంచి స్మగ్లింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యక్రమాల వరకూ అన్నింటినీ గుర్తించేందుకు కొత్త మార్పులతో ఏప్రిల్ 10 నుంచి హైవే అథారిటీ సిద్ధం అవుతోంది. సో ఈ మార్పుల గురించి తెలుసుకుని ప్రయాణికులు సిద్ధంగా ఉండటం బెటర్ పూర్తి డాక్యుమెంట్లతో. 

►ALSO READ | ఆఫీసుకు వస్తున్నాం.. రీల్స్ చూస్తున్నాం.. వెళుతున్నాం : ఐటీ కంపెనీలో IIT గ్రాడ్యుయేట్ ఉద్యోగి నిర్వేదం

©️ VIL Media Pvt Ltd.