Reading Time: < 1 minute
Delhi Assembly Security Breach Tata Sierra Rams Vip Gate 2 Driver Arrested Within Hours

Delhi: ఢిల్లీ అసెంబ్లీ వద్ద అతిపెద్ద భద్రతా వైఫల్యం జరిగింది. అత్యంత సురక్షితమైన ఈ ప్రాంతంలోకి అకాస్మాత్తుగా ఒక కారు దూసుకువచ్చింది. అసెంబ్లీ గేట్లు బద్దలుకొట్టుకుని అసెంబ్లీ ప్రాంగణంలోకి దూసుకురావడం కలకలం రేపింది. భద్రతా సిబ్బంది కాపలా ఉంటే ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడం సంచలనంగా మారింది. అసెంబ్లీ గేట్ నెం. 2ను నేరుగా ఢీకొట్టింది. గేటు విరిగిపోవడంతో, కారు వేగంగా ప్రవేశించింది.

Read Also: MK Stalin: మదురైని మణిపూర్‌లా మార్చాలనుకున్నారు.. బీజేపీపై స్టాలిన్ విమర్శలు..

మొత్తం ఈ ఘటన 5 నిమిషాల వ్యవధిలో చోటుచేసుకుంది. కారులో వచ్చిన వ్యక్తి ఒక పూలగుత్తిని ఉంచి, కారులో తిరిగి వెళ్లిపోయాడు. సంఘటన జరిగిన రెండు గంటల్లోపే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కారును, కార్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కారు టాటా సియెర్రా అని, యూపీ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి ఉన్నట్లు తేలింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.