Reading Time: 2 minutes
In Ipl 2026 Rcb Fans Celebrate As Tim David 106m Six Lands Outside Stadium Viral Video

RCB Fans Celebrations: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం నాడు చెన్నై సూపర్ కింగ్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌ లో ఆర్‌సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతని సిక్సర్ల సునామీకి చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లిపోయింది. అందులో ఒక భారీ సిక్సర్ స్టేడియం దాటి బయట పడటం, దాన్ని అభిమానులు పట్టుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

New Railway Line: తెలంగాణ, ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైల్వే ప్రాజెక్ట్‌పై అప్‌డేట్..

టిమ్ డేవిడ్ 106 మీటర్ల భారీ సిక్సర్‌ను బాదాడు. దీనితో ఆ బంతి స్టేడియం పైకప్పు దాటుకుని బయట ఉన్న పొదల్లో పడింది. ఆ సమయంలో స్టేడియం బయట ఉన్న ఆర్‌సీబీ అభిమానులు ఆ బంతిని వెతికి పట్టుకున్నారు. బంతి దొరికిన ఆనందంలో వారు చేసిన హంగామా, సంబరాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తమ అభిమాన జట్టు ఆటగాడు కొట్టిన బంతి తమకు దొరకడంతో వారు ఎంతో ఉత్సాహంగా కేకలు వేస్తూ రచ్చరచ్చ చేశారు.

ఇక మ్యాచ్‌ లో టిమ్ డేవిడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లతో అజేయంగా 70 పరుగులు చేసి చెన్నై బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ సీజన్‌ లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అత్యధిక స్కోరు సాధించడంలో డేవిడ్ కీలక పాత్ర పోషించాడు. ఆయన మెరుపు ఇన్నింగ్స్ ధాటికి ఆర్‌సీబీ నిర్ణీత ఓవర్లలో భారీ స్కోరును నమోదు చేసింది. చివర్లో మ్యాచ్ అద్భుత ప్రదర్శనకు గాను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.

Rajamouli: జక్కన్న మామూలోడు కాదు.. ఏకంగా VFX స్టూడియో సెటప్!

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్‌సీబీ, ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 43 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టిమ్ డేవిడ్ సిక్సర్ల వర్షానికి తోడు, ఆర్‌సీబీ బౌలర్లు కూడా క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో చెన్నై లక్ష్యానికి దూరంగా ఆగిపోయింది. ఈ విజయంతో ఆర్‌సీబీ అభిమానులు స్టేడియం లోపల, బయట పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యంగా టిమ్ డేవిడ్ కొట్టిన ఆ 106 మీటర్ల సిక్సర్ ఈ మ్యాచ్‌ కే హైలెట్‌గా నిలిచింది.