Reading Time: 2 minutes

42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న బిగ్బాస్ బ్యూటీ.. క్యూట్ ఫోటోలతో ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్

Caption of Image.

హిందీ టెలివిజన్ మరియు బాలీవుడ్ రంగాల్లో గుర్తింపు పొందిన నటి కరిష్మా తన్నా (Karishma Tanna) గుడ్ న్యూస్ ప్రకటించారు. తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నట్లు ఆమె అభిమానులకు తెలియజేశారు. తన భర్త వరుణ్ బంగేరాతో కలిసి తీసుకున్న ఫోటోలు షేర్ చేస్తూ తల్లి కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2026 ఆగస్టులో ఈ జంట తమ మొదటి బిడ్డను ఆహ్వానించనుంది.

గుడ్ న్యూస్ ప్రకటించిన దంపతులు

కరిష్మా తన్నా, వరుణ్ బంగేరా సోషల్ మీడియా ద్వారా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ప్రెగ్నెన్సీ ఫోటోషూట్‌కు సంబంధించిన అందమైన చిత్రాలను షేర్ చేస్తూ,“ఒక చిన్న అద్భుతం. మాకు దక్కిన గొప్ప బహుమతి.. ఆగస్టు 2026” అనే భావోద్వేగ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టు ద్వారా వారి బేబీ 2026 ఆగస్టులో జన్మించనుందని స్పష్టమైంది. 2022లో వివాహం చేసుకున్న ఈ జంట, నాలుగేళ్ల తర్వాత తమ మొదటి సంతానాన్ని ఆహ్వానించబోతుండటం విశేషం.

Also Read : నట్టింట్లో ఉరేసుకుని ప్రాణం తీసుకున్న సీరియల్ నటి !

ఈ సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇందులో ఓ ఫోటోలో ‘Mom’ మరియు ‘Dad’ క్యాప్స్ ధరించి ఒకరినొకరు హాగ్ చేసుకుంటున్న ఫోటో అట్ట్రాక్ట్ చేస్తోంది. అలాగే, మరో ఫొటోలో చిన్న బేబీ షూస్ పట్టుకుని ఆనందాన్ని వ్యక్తం చేసిన క్షణాలు ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్నాయి. వీటికి తోడుగా తమ పెంపుడు జంతువులను కూడా ఈ ఆనందంలో భాగం చేసిన ప్రత్యేక ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ప్రేమ నుంచి వివాహం వరకు

కరిష్మా–వరుణ్ ప్రేమకథ 2021లో ప్రారంభమైంది. అదే సంవత్సరం నిశ్చితార్థం జరగగా, 2022 ఫిబ్రవరి 5న ముంబైలో వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

కరిష్మా తన్నా కెరీర్ విషయానికి వస్తే, టెలివిజన్ & సినీ రంగాల్లో రెండు దశాబ్దాలుగా కొనసాగుతుంది. క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ, నాగిన్ 3, ఖయామత్ కీ రాత్ వంటి షోలతో ప్రేక్షకులకి దగ్గరైంది. ‘గ్రాండ్ మస్తీ, సంజు, సూరజ్ పే మంగళ్ భారీ వంటి భారీ ప్రాజెక్టుల్లో నటించి గుర్తింపు పొందింది. అలాగే OTT ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా Hush Hush, Scoop వంటి ప్రాజెక్ట్‌లతో తనదైన ముద్ర వేసుకుంది. అంతేకాదు 2014లో బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షోలో పాల్గొని మొదటి రన్నరప్ గా నిలిచింది.

మొత్తానికి కరిష్మా తన్నా 42 ఏళ్ల వయసులో తన మొదటి బిడ్డకు జన్మనిస్తుండటం విశేషం సంతరించుకుంది. ఈ క్రమంలోనే అభిమానులు, తోటి నటీనటులు ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.