
KKR vs PBKS: ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఈరోజు (2026, ఏప్రిల్ 6న) జరగనున్న మ్యాచ్‌పై వర్షం మబ్బులు కమ్ముకున్నాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న ఈ పోరుకు వర్షం అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఒక్క విజయం కూడా నమోదు చేయని కోల్‌కతా, ఈ మ్యాచ్ లో గెలిచి ఖాతా తెరవాలని భావిస్తోంది. కానీ వర్షం కారణంగా మ్యాచ్ కి వర్షం నుంచి ప్రమాదం పొంచి ఉంది. మ్యాచ్‌కు ముందు రోజు భారీ వర్షం పడటంతో ఇరు జట్ల ప్రాక్టీస్ సెషన్‌లు కూడా రద్దయ్యాయి.
వాతావరణ హెచ్చరిక:
భారత వాతావరణ శాఖ (IMD) బులిటెన్ ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో ఆదివారం నుంచి గురువారం వరకు ‘కాల్‌బైశాఖి’ (Kalbaishakhi) గాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉంది. మంగళ, బుధవారాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ, సోమవారం మ్యాచ్ సమయానికి కూడా 85 శాతం వర్షం పడే అవకాశం ఉందని అక్యువెదర్ (Accuweather) పేర్కొంది. ప్రస్తుతం ఈడెన్ గార్డెన్స్ మైదానం మొత్తం కవర్లతో కప్పి ఉంది. ఈ మైదానంలో అత్యుత్తమ డ్రైనేజీ సౌకర్యాలు కలిగి ఉన్నప్పటికీ, వర్షం సుమారు 90 నిమిషాల కంటే ఎక్కువ సేపు పడితే ఆట నిర్వహించడం కష్టతరమవుతుంది.
మ్యాచ్ జరిగే అవకాశం ఉందా?:
వర్షం ప్రభావం ఎక్కువగా ఉంటే తగ్గించిన ఓవర్లతో మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలంటే రాత్రి 10:56 గంటలలోపు ఆట ప్రారంభం కావాలి. దానికి ముందు 10:46 గంటలకు టాస్ పూర్తి కావాలి.. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఈరోజు సుమారు 85 శాతం వర్షం పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మ్యాచ్ పూర్తిగా జరగడం కష్టంగా మారింది. గత సీజన్‌లో కూడా ఇదే మైదానంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 201 పరుగులు చేయగా, కోల్‌కతా 7 పరుగులు చేసిన దశలో వర్షం ఆటను ఆపేసింది. చివరికి ఇరు జట్లు ఒక్కో పాయింట్‌తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
Also Read : ధోనీ, బ్రెవిస్ రీఎంట్రీకి డేట్ ఫిక్స్.. వచ్చేది ఆ రోజే!
కాగా వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న పంజాబ్ కింగ్స్ జట్టుకి పాయింట్ లభిస్తే ఫర్వాలేదు కానీ, పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న కేకేఆర్‌కు మాత్రం ఈ మ్యాచ్ గెలవడం అత్యంత కీలకంగా మారింది. ఈ వర్షం తగ్గుముఖం పట్టి పూర్తిస్థాయి మ్యాచ్ జరుగుతుందో లేదో అని క్రికెట్ అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు.
मौसम संबंधी चेतावनी
मुख्य बिंदु
(i) उत्तर-पश्चिम भारत में इस सप्ताह के दौरान दो पश्चिमी विक्षोभों के एक के बाद एक आने की संभावना है, जिनकी चरम गतिविधि 7 और 8 अप्रैल को रहेगी। कश्मीर घाटी में 7 अप्रैल को छिटपुट भारी वर्षा की संभावना है।
(ii) मध्य, पूर्वी और प्रायद्वीपीय… pic.twitter.com/TdIeoBk83a
— India Meteorological Department (@Indiametdept) April 5, 2026