Reading Time: < 1 minute
Assam Cm Himanta Biswa Sarma Wife Riniki Bhuyan Passport Controversy Congress Allegations

Riniki Bhuyan Sarma: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇప్పుడు రసవత్తరంగా సాగుతుంది. ఏప్రిల్ 9న రాష్ట్రంలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికారిక, ప్రతిపక్ష పార్టీలు ఈ దఫా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ధీమాతో ఉన్నాయి. ఈ క్రమంలో ఓటింగ్‌కు కొద్ది రోజుల ముందు, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మపై కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణ చేసింది. ఆమెకు మూడు పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఆరోపించారు. ఖేరా ప్రకటన ఒక్కసారిగా అస్సాంలో రాజకీయ దుమారాన్ని రేపింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి హిమంత తన భార్యపై వచ్చిన ఆరోపణలకు స్వయంగా స్పందించారు. పవన్ ఖేరాపై పరువు నష్టం కేసు వేస్తానని సీఎం హెచ్చరించారు. ఇంతకీ అస్సాం ముఖ్యమంత్రి భార్య రినికి ఎవరు, ఆమె ఏం చేస్తారు అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: US-Iran Plan: అలా అయితే హార్ముజ్ ఓపెన్ చేయం.. సంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు..

అస్సాంలో, మొత్తం ఈశాన్య ప్రాంతంలో రినికి భూయాన్ శర్మ చాలా ఫేమస్. రినికి ఒక న్యాయవాది, అలాగే జాతీయ స్థాయిలో అస్సాంకు ప్రాతినిధ్యం వహించిన మాజీ టెన్నిస్ క్రీడాకారిణి కూడా. ప్రస్తుతం ఆమె ఈ ప్రాంతంలో అతిపెద్ద మీడియా సంస్థలలో ఒకదానికి అధిపతిగా ఉన్నారు. రింకీ తన ఫిట్‌నెస్‌తో కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఆమె 1973 జూలై 31న గౌహతిలో జన్మించింది. ఆమె ఒక ప్రముఖ కుటుంబానికి చెందినది. ఆమె తండ్రి జాదవ్ చంద్ర భూయాన్. ఆయన ఒక ఫేమస్ బిజినెస్‌మ్యాన్. ఆమె సెయింట్ మేరీస్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, గౌహతిలోని కాటన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్, పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, అక్కడే ఎల్‌ఎల్‌బి డిగ్రీని కూడా తీసుకుంది. ఆమె ప్రస్తుతం అనేక అస్సామీ ఛానెళ్లకు మాతృసంస్థ అయిన ప్రైడ్ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు ఛైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. రింకీ – హిమంత కాలేజీలో ఉన్నప్పుడు కలుసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

READ ALSO: PCB Chairman vs IPL: ఇంత కుల్లుబోతోడివి ఏందయ్యా నువ్వు.. ఐపీఎల్‌పై పీసీబీ ఛైర్మన్ ఏడుపు!