
బాలీవుడ్‌లో రూపొందిన హిందీ కామెడీ-డ్రామా సిరీస్ ‘మా కా సామ్’ (Ma Ka Sam). ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మోనాసింగ్ మరియు మిహిర్ అహుజా ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమ మరియు అల్గారిథమ్స్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ లైట్-హార్టెడ్ డ్రామా ఏప్రిల్ 3 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
నికోలస్ ఖార్కొంగోర్ రూపొందించిన ఈ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకులకు భావోద్వేగంతో పాటు వినోదాన్ని అందించేలా రూపొందించబడింది. కుటుంబ బంధాలు, సంబంధాల లోతు, వ్యక్తిగత ఎదుగుదల వంటి అంశాలను చర్చించడంతో ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. దానికితోడు హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలు, నిజజీవితానికి దగ్గరగా ఉండే పాత్రల నిర్మాణం ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
All variables lead here 😌#MaaKaSumOnPrime, New Series, Watch Now: https://t.co/60jWO3EyWJ pic.twitter.com/Exe8zPKhzi
— prime video IN (@PrimeVideoIN) April 3, 2026
ముఖ్యంగా కుటుంబ సంబంధాల్లో ఎదురయ్యే సవాళ్లు, భావోద్వేగ సంఘర్షణలను సహజంగా చూపించడం ఈ కథలో ప్రధాన బలం. హార్ట్ టచింగ్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సిరీస్ మంచి ఛాయిస్ అనే చెప్పాలి. ఎమోషన్స్, కామెడీ, లవ్ కలగలిపిన ఈ సిరీస్ ప్రేక్షకులను మొదటి ఎపిసోడ్ నుంచి చివరి వరకు ఆకట్టుకునేలా ఉంటుంది.
కథేంటంటే:
ఈ కథ ఒంటరి తల్లి వినీత (మోనా సింగ్), ఆమె 19 ఏళ్ల కొడుకు అగస్త్య (మిహిర్ అహుజా) చుట్టూ తిరుగుతుంది. అగస్త్య మాథ్స్‌లో జీనియస్. ప్రపంచంలోని ప్రతి సమస్యకు మ్యాథ్స్‌తో పరిష్కారం కనిపెట్టొచ్చని నమ్ముతాడు. తన తల్లికి సరైన జీవిత భాగస్వామిని వెతకాలని అగస్త్య నిర్ణయించుకుని, ‘ప్రాజెక్ట్ మామ్’ పేరుతో ఒక మిషన్‌ను మొదలుపెడతాడు. దాని ద్వారా పర్ఫెక్ట్ డేటింగ్ అల్గారిథం సృష్టించాలి అనుకుంటాడు.
Also Read : ఆరుగురిని అరెస్ట్ చేయించా.. అకౌంట్లను ట్రేస్ చేస్తా
అందుకోసం హార్వర్డ్ నుంచి వచ్చిన విజిటింగ్ ప్రొఫెసర్ ఇరా (అంగీరా ధర్) సాయం తీసుకుంటాడు. కానీ.. వినీత అదే టైంలో అభిమన్యు (రణ్‌వీర్ బ్రార్) అనే వ్యక్తితో చనువుగా ఉంటుంది. అది అగస్త్యకు నచ్చదు. మరోవైపు తన అల్గారిథమ్‌లు ఫెయిల్ అవుతుంటాయి. అప్పుడు అగస్త్య ఏం చేశాడు? అనేదే మిగిలిన కథ.