Reading Time: < 1 minute

హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఉద్యోగాలు: ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అర్హత ఉంటే చాలు..

Caption of Image.

సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎస్​వీపీఎన్​పీఏ) స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  

మొత్తం ఖాళీలు: 8.

విభాగాల వారీగా ఖాళీలు: సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ 2, లాంగ్వేజ్ ఇన్​స్ట్రక్టర్ 1, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ –1 4, జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్ 1, ఎలక్ట్రీషియన్ 1. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్, స్టెనోగ్రఫీలో  నైపుణ్యం, సంబంధిత ట్రేడులో ఐటీఐ, డిగ్రీ లేదా డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 

లాస్ట్ డేట్: ఏప్రిల్ 27. 

సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ svpnpa.gov.in ను సందర్శించండి. 

©️ VIL Media Pvt Ltd.