Reading Time: < 1 minute
Trisha Krishnan Instagram Post About Vijay Rumors Vishwambhara Updates

తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం విజయ్ – త్రిషల పెళ్లి వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరూ త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక ‘లవ్ కోట్’ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.. ‘ఇతరుల అభిప్రాయాలను లేదా ఆలోచనలను మీరు ఎలా నియంత్రించగలరు? మీరు చేయగలిగిందల్లా మీ జీవితాన్ని ఉత్తమంగా జీవించడమే. నిజాయితీతో బ్రతికినప్పుడు రాత్రిపూట హాయిగా నిద్రపోవచ్చు’ అంటూ సాగే ఒక సంభాషణను ఆమె పోస్ట్ చేశారు. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లను ఉద్దేశించే త్రిష ఈ రకమైన కౌంటర్ ఇచ్చారని నెటిజన్లు భావిస్తున్నారు.

Also Read : Dilraju: అనిల్ రావిపూడి హీరోగా దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. త్వరలోనే నటుడిగా ఎంట్రీ!

అంతే కాదు గతంలో ‘లియో’ సినిమా సమయంలోనూ వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యంపై చర్చ జరిగింది. అయితే త్రిష తాజా పోస్ట్ చూస్తుంటే, తనపై వస్తున్న వార్తలను ఆమె పెద్దగా పట్టించుకోవడం లేదని, తన పని తాను చేసుకుంటూ ప్రశాంతంగా ఉండటానికే మొగ్గు చూపుతున్నారని అర్థమవుతోంది. ప్రస్తుతం త్రిష కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ (Vishwambhara) వంటి భారీ సోషియో ఫాంటసీ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రూమర్లు ఎలా ఉన్నా, ఒక సీనియర్ హీరోయిన్ గా త్రిష ఇప్పటికీ స్టార్ హీరోలందరికీ ఫస్ట్ ఛాయిస్ గా నిలుస్తుండటం విశేషం.