టూత్ పేస్ట్ : మీ వెండి వస్తువులు నల్లగా మారినట్లయితే వాటిని తెల్లగా మార్చేందుకు టూత్ పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకోసం నల్లగా మారిన వెండి వస్తువులపై కొంచెం టూత్ పేస్ట్ రాయండి. దాదాపు 10-15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత పాత టూత్ బ్రష్‌తో మెల్లగా రుద్దండి.చివరగా శుభ్రమైన నీటితో కడిగితే వెండి వస్తువులు తళతళలాడతాయి.
బేకింగ్ సోడా, వెనిగర్ : వెండి వస్తువులకు పాత మెరుపును తీసుకురావడానికి ఇది ఒక శక్తివంతమైన మార్గం. ఇందుకోసం బేకింగ్ సోడాలో కొంచెం వైట్ వెనిగర్ కలిపి పేస్ట్‌లా చేయండి. ఈ మిశ్రమాన్ని మెత్తని వస్త్రంతో వెండి వస్తువులపై రాయండి. కాసేపు మెల్లగా రుద్ది, ఆపై నీటితో శుభ్రం చేయండి. అంతే నల్లగా ఉన్న నగలు క్షణాల్లో తెల్లగా మెరిసిపోతాయి
నిమ్మరసం: నిమ్మరసంలోని గుణాలు జిడ్డును, నలుపును త్వరగా వదిలిస్తాయి. బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం చుక్కలు వేసి కలపండి. దీనిని వెండి పాత్రలు లేదా ఆభరణాలకు పట్టించి రుద్దండి. ఇలా చేయడం వల్ల వెండి పాత్రలు కొత్తవాటిలా మెరుస్తాయి.
సోప్ లేదా షాంపూ: సాధారణ మురికిని పోగొట్టడానికి డిష్ సోప్ లేదా షాంపూ బాగా ఉపయోగపడతాయి. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 2 స్పూన్ల డిష్ సోప్ లిక్విడ్ లేదా షాంపూ కలపండి. ఈ నీటిలో వెండి వస్తువులను 10 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత బ్రష్‌తో రుద్ది కడిగేస్తే, మసకబారిన వెండికి మళ్ళీ మెరుపు వస్తుంది.
గమనిక: వెండి వస్తువులను శుభ్రం చేసిన తర్వాత మెత్తని పొడి గుడ్డతో తుడవడం మర్చిపోకండి. తద్వారా నీటి మరకలు పడకుండా ఉంటాయి. ఈ సింపుట్ చిట్కాలను పాటిస్తే మీరు షాప్‌కు వెళ్లే పనిలేకుండా ఇంట్లోనే నల్లగా మారిన వెండి వస్తువులను కొత్తవిగా చేసుకోవచ్చు.




