
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ లో భాగంగా నేడు (2026, ఏప్రిల్ 6న) ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు తలపడబోతున్నాయి. వరుసగా రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న కేకేఆర్, ఈ మ్యాచ్‌తో తిరిగి ఫామ్‌లోకి రావాలని భావిస్తోంది. మరోవైపు, మరోవైపు పంజాబ్ జట్టు వరుస విజయాలతో అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచిన పంజాబ్, అదే జోరును కొనసాగించాలని చూస్తోంది.
రహానేపై ఒత్తిడి:
కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే నాయకత్వం, అతడి నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడుతున్నప్పటికీ, ఆ తర్వాతి ఓవర్లలో రన్‌రేట్ తగ్గిపోవడంతో రహానేపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ విమర్శలకు స్పందించిన రహానే.. నా స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడేవారు బహుశా మ్యాచ్‌లు చూడటం లేదు, లేదంటే నాపై అసూయతో ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నాడు. 2023 నుంచి నా స్ట్రైక్ రేట్ అత్యుత్తమంగా ఉంది. కొందరు కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. నా సక్సెస్ చూసి వారు ఓర్వలేకపోతున్నారని ఆరోపించాడు. ఫిన్ అలెన్‌తో తన భాగస్వామ్యం బాగానే ఉంది, పవర్‌ప్లేలో నిర్భయంగా ఆడటం ముఖ్యమని రహానే వెల్లడించాడు.
కెప్టెన్సీ రేసులో రింకూ సింగ్?:
కేకేఆర్ జట్టులో ఫినిషర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రింకూ సింగ్, భవిష్యత్ కెప్టెన్‌గా కనిపిస్తున్నారు. గత మ్యాచ్‌లో రహానే గాయపడిన సమయంలో రింకూ జట్టును నడిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. జట్టులో ఒకవేళ మార్పులు జరిగితే రింకూ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
తుది జట్ల అంచనా:
కోల్‌కతా నైట్ రైడర్స్:
టీమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్, అజింక్య రహానే (కెప్టెన్), అంగ్‌క్రిష్ రఘువంశీ ( వికెట్ కీపర్), రింకూ సింగ్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కార్తీక్ త్యాగి, బ్లెస్సింగ్ ముజరబానీ.
పంజాబ్ కింగ్స్:
ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కూపర్ కానోలీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైశాక్, యుజ్వేంద్ర చాహల్.