
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన MLAల అంశంపై స్పీకర్ విచారణ తుది దశకు చేరింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తున్న క్రమంలో ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో ఫిరాయింపు MLAల కేసులో తెలంగాణ స్పీకర్ కీలక తీర్పును వెలువరించారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని.. MLAల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేశారు. ఐదుగురు MLAలపై ఆరోపణలు తోసిపుచ్చిన స్పీకర్.. పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవని వెల్లడించారు. ఈ మేరకు ఫిరాయింపు MLAల కేసులో ఐదుగురు ఎమ్మెల్యేలపై వేసిన పిటిషన్లను కొట్టేశారు. అరెకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్, ప్రకాష్‌గౌడ్, గూడెం మహిపాల్‌కు ఊరట కలిగింది. మరో ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటీషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది..
ఇదిలాఉంటే.. బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన MLAల అంశంపై 19న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.. ఈ క్రమంలోనే.. స్పీకర్ ప్రసాద్ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవడం కీలకంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..