Reading Time: < 1 minute
Panchayat Elections 2025: తెలంగాణలో ప్రారంభమైన మూడో విడత పంచాయతీ ఎన్నికలు పోలింగ్!

తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయాన్ని పోలింగ్ కేంద్రాలకు భారీగా చేరుకుంటున్నారు ఓటర్లు.. పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి త్వరగా స్వగ్రామాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌ నిర్వహించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు అధికారులు. ఇక ఇవాళ మూడో విడత పోలింగ్ జరుగుతుండగా.. నేటి గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి.

అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 182 మండలాల్లోని 3,752 గ్రామాలు, 28,406 వార్డుల్లో పోలింగ్‌ జరుగుతుతోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 4,157 గ్రామాలు, 36,434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 394 సర్పంచ్ స్థానాలు, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 11 గ్రామాలు, 112 వార్డులకు నామినేషన్‌లు దాఖలు కాలేదు దీంతో 3,752 సర్పంచ్ స్థానాలకు 12,640 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

ఇక ఇప్పటికే రెండు దఫాల్లో ఎన్నికలు నిర్వహించగా ఇవాళ మూడో విడత పోలింగ్ జరుగుతుంది. ఇక ఇవాళ్టితో గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ జరిగే ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.