Reading Time: < 1 minute
Sreeleela Funny Comments At Narasaraopeta College Fest Viral Video

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ క్రేజ్ ఉన్న హీరోయిన్ శ్రీ లీల. 2019లో కన్నడ సినిమా ‘కిస్’ (Kiss) ద్వారా వెండితెరకు పరిచయమై.. తెలుగులో ‘పెళ్లి సందడి’ చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా, శ్రీ లీల నటనకు, అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యరు. తర్వాత రవితేజ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించి మరింత ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి భారీ ప్రాజెక్టులతో పాటు మరికొన్ని క్రేజీ సినిమాలతో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వాహించిన ఫెస్ట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యింది. ఈ సందర్భంగా

Also Read : Rowdy Janardhana: “రౌడీ జనార్దన”లో ఆ స్టార్ హీరోయిన్ ?

ఆమె విద్యార్థులతో ముచ్చటిస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. అలాగే ఒంగోలు తన అమ్మమ్మ వాళ్ళ ఊరని చెప్పడంతో విద్యార్థుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. విద్యార్థులు కూడా శ్రీలీల ప్రసంగిస్తున్న సమయంలో కొందరు అబ్బాయిలు “డాన్స్.. డాన్స్” అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టారు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో కొందరు సెలబ్రిటీలు అసహనం వ్యక్తం చేస్తారు, కానీ శ్రీలీల మాత్రం తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. “నిజంగా పెళ్లాన్ని అడిగినట్టు అడిగారు.. సరే డ్యాన్స్ చేద్దాం రండి” అంటూ ఆమె చమత్కారంగా సమాధానం ఇవ్వడంతో అక్కడి వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఆమెలోని ‘ప్రెజెన్స్ ఆఫ్ మైండ్’కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంతటితో ఆగకుండా విద్యార్థులతో కలిసి ఆమె స్టేజ్ మీద స్టెప్పులు వేయడం తో ఆ ఈవెంట్ అంతా ఈలలు, గోలలతో మారుమోగిపోయింది. శ్రీలీల ఎంత ‘డౌన్ టు ఎర్త్’ ఉంటారో ఈ సంఘటన మరోసారి నిరూపించిందని అభిమానులు ప్రశంసిస్తున్నారు.