Reading Time: < 1 minute

న్యూయార్క్: వెనుజులా నుంచి భారత దేశం చమురు దిగుమతి చేసుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. తాము ఇప్పటికే వెనుజులా పాలనపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం అమెరికా ఆధీనంలో ఉందని, తాము కోరుకున్నట్లుగానే వెనుజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. అక్కడి చమురు నిల్వలు పూర్తిగా అమెరికా చేతికి వచ్చే వరకు ఆమెనే అధ్యక్షురాలుగా ఉంటుందని తెలియజేశారు. భారత కూడా వెనుజులలో చమురును దిగుమతి చేసుకుంటుందని డోనాల్డ్ ట్రంప్ వివరించారు. దీనికి సంబంధించిన ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చామన్నారు. వెనుజులా చమరు కోసం చైనా కూడా అమెరికాతో చర్చలు జరిపే అవకాశం ఉందని స్పష్టం చేశారు. వెనుజులా చమురు దిగుమతిపై భారత్ ఇప్పటి వరకు స్పందించలేదు. వెనుజులాపై అమెరికా సైనిక దాడి ఇచేసి అనంతరం ఆ దేశపు అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టు చేసి అమెరికాకు తీసుకెళ్లింది. ప్రస్తుతం వెనుజులా తాత్కలిక అధ్యక్షురాలుగా రోడ్రిగ్జ్ పాలన కొనసాగిస్తున్నారు.