Reading Time: < 1 minute

మెల్‌బర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా కజికిస్థాన్‌కు చెందిన ఎలెనా రిబకినా నిలిచింది. రాడ్ లావర్ అరేనా వేదికగా జరిగిన ఫైనల్‌లో ప్రపంచ నెంబర్ వన్ సబలెంకా(బెలారస్)పై 6-4, 4-6, 6-4 తేడాతో రిబకినా విజయం సాధించింది. 2023 ఫైనల్‌లోనూ వీరిద్దరే ప్రత్యర్థులు, ఆ పోరులో సబలెంకా విజయం సాధించింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో గెలిచి సబలెంకాపై రిబకినా ప్రతీకారం తీర్చుకుంది. కాగా, రిబకినాకు ఇది రెండో గ్రాండ్ స్లామ్ విజయం. ఆమె 2022లోం వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకుంది.