
బెంగళూరు: మందార పువ్వు కాండం గొంతులో ఇరుక్కొని ఆరు నెలల బాలుడు మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రం హుణసూరు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… హనగోడు హోబళి దొడ్డ హెజ్జూరు గ్రామంలో సుదర్శన్, నవ్య అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఆరు నెలల క్రితం కుమారుడు జన్మించాడు. మందారం పువ్వు కింద భాగాన ఉండే కాండాన్ని బాలుడు నోట్లో పెట్టుకోవడంతో గొంతులోనికి వెళ్లింది. కాండం ఊపిరితిత్తులోనికి వెళ్లింది. వెంటనే బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మైసూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. హుణసూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.