Reading Time: < 1 minute

ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి సమీపంలో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ తోటలోకి కొబ్బరికాయల కోతకు 18 మంది కూలీలు లారీలో వచ్చారు. కాయలు కోస్తుండగా.. అక్కడే కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు లారీకి తగిలాయి. దీంతో మంటలు చెలరేగి ఓ వ్యక్తి మృతి చెందాడు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మృతుడు మల్లికార్జున దేహం పూర్తిగా కాలిపోయింది. అతడు కొబ్బరికాయల అమ్మకంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తాడని పోలీసులు తెలిపారు.