Reading Time: < 1 minute

హైదరాబాద్‌ నగరంలొోని కోఠిలో కాల్పులు కలకలం సృష్టించాయి. శనివారం ఉదయం కోఠిలోని ఎస్ బిఐ ప్రధాన కార్యాలయం ఎటిఎం వద్ద కొందరు దుండగులు కాల్పుల జరిపారు. నగదు డిపాజిట్ చేయడానికి వచ్చినే రషీద్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపి దాదాపు 6 లక్షల రూపాయలను ఎత్తికెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల ఘటనలో రషీద్ కాలికి బుల్లెట్ తగలడంతో గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన రషీద్ ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు సిసిటీవి ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.