Reading Time: < 1 minute

హైదరాబాద్: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘VD14’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా ప్రచారంలో ఉంది. కాగా, సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టైటిల్, గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు ‘రణబాలి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి ఓ గ్లింప్స్‌ని కూడా విడుదల చేశారు.

ఈ కథ స్వాతంత్ర్యం గురించి కాదని.. స్వాతంత్ర్యం ముందు జరిగిన ఓ చీకటి చరిత్ర గురించి అని గ్లింప్స్‌ ఆరంభంలో పేర్కొన్నారు. ఇక ఆ సమయంలో జరిగిన దారుణాల గురించి.. భారతదేశం నుంచి బ్రిటీషర్లు దోచుకెళ్లిన సంపద గురించి టీజర్‌లో చూపించారు. ఈ కథ 1878 ప్రాంతంలో జరిగినదిగా టీజర్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో సర్ థియోడర్ హెక్టర్‌గా ఆర్నాల్డ్ వోస్లో, జయమ్మగా రష్మిక మందన్న నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్-అతుల్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 11న ఈ సినిమా విడుదల కానుంది.