Reading Time: < 1 minute
Ram Charan Meets Team Rakasa On Peddi Movie Sets Mega Boost

మెగా డాటర్ నిహారిక కొణిదెల తన ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్న క్రేజీ ఫాంటసీ ఎంటర్టైనర్ ‘రాకాస’. ఏప్రిల్ 3న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా, చిత్ర యూనిట్ తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ను కలిశారు. ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ (Peddi) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న భారీ సెట్స్‌లోకి ‘రాకాస’ టీమ్ వెళ్ళగా, చరణ్ వారితో సరదాగా ముచ్చటించారు.

ఈ సందర్భంగా ‘రాకాస’ గ్లింప్స్, సాంగ్స్ చూసిన రామ్ చరణ్, టీమ్ అందరినీ అభినందించారు. చరణ్ ఇచ్చిన ఈ సపోర్ట్ అటు నిహారికకు, ఇటు హీరో సంగీత్ శోభన్ అండ్ టీమ్‌కు ఫుల్ ఎనర్జీని ఇచ్చింది. “మెగా పవర్‌స్టార్ అప్రిషియేషన్ మా టీమ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది” అంటూ నిహారిక తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘పెద్ది’ సెట్స్ నుండి వచ్చిన ఈ పిక్చర్స్ ఇప్పుడు నెట్టింట మెగా ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాయి.