Reading Time: 2 minutes
Trump Us Iran War Speech Operation Epic Fury Nuclear Threat

యుద్ధంలో ఇరాన్‌ను అన్ని విధాలుగా దెబ్బతీశామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్‌తో యుద్ధంపై జాతినుద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా యుద్ధం చేయడానికి గల కారణాలను వివరించారు. ‘‘అమెరికా అంతం కావాలని ఇరాన్ కోరుకుంటోంది. అందుకే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఇరాన్‌పై యుద్ధం ప్రకటించాం. అణ్వాయుధాన్ని తయారు చేసే పనిలో ఉండగా ఇరాన్‌పై దాడి చేశాం. అమెరికా భద్రత కోసం ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చేపట్టాం. ఇరాన్ దగ్గర ప్రస్తుతం అతి కొద్ది అణ్వాయుధాలు మాత్రమే ఉన్నాయి. త్వరలోనే ఇరాన్‌లో మా పని పూర్తి చేస్తాం. ఇప్పుడు అమెరికాను ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా మార్చాం.’’ అని ట్రంప్ స్పష్టం చేశారు

‘‘47 సంవత్సరాలుగా ఇరాన్‌లో దారుణాలు జరుగుతున్నాయి. చేసిన తప్పులకు ఇప్పుడు ఇరాన్ శిక్ష అనుభవిస్తోంది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండటానికి అనుమతించం. ఇరాన్-రష్యా కుమ్మక్కయ్యాయి. ప్రస్తుతం కీలక నేతలు చనిపోవడంతో ఇరాన్‌లో పాలకులు మారారు. ఇరాన్ రక్షణ వ్యవస్థను పెకిలించాం. ఇరాన్ ఓడిపోతే.. హార్ముజ్ ఆటోమేటిక్‌గా తెరుచుకుంటుంది. అయినా కూడా హార్ముజ్‌తో అమెరికాకు సంబంధం లేదు. ఎవరికైతే అవసరమో ఆ దేశాలే కాపాడుకోవాలి. మా దేశంలో చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. త్వరలోనే చమురు సంక్షోభం ముగుస్తుంది. మూడు రోజుల్లో యుద్ధం ముగుస్తుంది. గత ఐదేళ్ల పాలనలో ఎన్నో విజయాలు సాధించాను. ఇప్పుడు గత అమెరికా అధ్యక్షులు చేసిన తప్పులను సరి చేస్తున్నా.’’ అని ట్రంప్ పేర్కొన్నారు.