Reading Time: < 1 minute

అమెరికా వెనెజువెలాలో నిర్వహించిన సైనిక చర్యలో భాగంగా, యూఎస్ సైనికులు వాడిన రహస్య ఆయుధం పేరును ట్రంప్ ఎట్టకేలకు వెల్లడించారు. ఆ ఆయుధం పేరును డిస్కోంబోబుటర్ అని తెలిపారు. వెనెజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించినప్పుడు ఆ దేశపు సైనిక వ్యవస్థను స్థంభింపజేసేందుకు ఈ ఆయుధాన్ని ఉపయోగించినట్లు ట్రంప్ తెలిపారు. న్యూయార్క్ పోస్ట్ కి శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంగా మెక్సికోతో సహా డ్రగ్ ను వ్యాపింపజేసే దేశాలపై దాడులు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. అమెరికా వద్ద పల్స్డ్ ఎనర్జీ ఆయుధం ఉందనే నివేదికలపై వ్యాఖ్యానిస్తూ, ది డిస్కోంబోబుటర్ ఆ ఆయుధం అనీ,

దాని గురించి మాట్లాడేందుకు తనకు అనుమతి లేదని పేర్కొన్నారు. వెనెజువెలా వద్ద చైనా, రష్యా కు చెందిన రాకెట్లు ఉన్నాయని, వారు ఎప్పుడూ ఉపయోగించలేదని పేర్కొన్నారు. తాము బటన్ నొక్కినప్పుడు ఆవి ఏవీ పనిచేయలేదని, అలాగే తాము ప్రయోగించిన ఆయుధం వల్ల కారకస్ లోదాదాపు అన్ని లైట్లు ఆగిపోయాయని పేర్కొన్నారు. అసలు అది ఎలా సాధించారో మాత్రం వివరించలేదు. తూర్పు ఫసిఫిక్ మహా సముద్రంలో మాదక ద్రవ్యాలను అక్రమ రవాణాచేస్తున్న పడవపై శుక్రవారం అమెరికా దాడి చేసింది. మదురు పట్టుబడిన తర్వాత ఇలాంటి దాడి చేయడం ఇదే తొలిసారి.