Reading Time: < 1 minute

వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా బిసిఎ స్టేడియం వేదికగా హై టెన్షన్ మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సిబి జట్టు ముంబైని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఈ టోర్నమెంట్‌ ఆరంభ మ్యాచ్‌లో ముంబైని ఆర్‌సిబి చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లోనూ అదే ఫలితాన్ని రాబట్టాలని స్మృతి మంధన సేన భావిస్తోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు తప్పుకుండా గెలిచి తీరాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ మ్యాచ్‌పై తారాస్థాయిలో ఉత్కంఠ నెలకొంది.

తుది జట్లు:

ముంబై: సజీవన్ సజన, హేలీ మ్యాథ్యూస్, నాట్ స్కీవర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమిలియా కెర్ర్, రహిలా ఫిర్దౌస్(కీపర్), అమంజోత్ కౌర్, సంస్కృతి గుప్తా, వైష్ణవి శర్మ, షబ్నిమ్ ఇస్మాయిల్, పూనమ్ ఖేమ్నార్.

బెంగళూరు: గ్రేస్ హారిస్, స్మృతి మంధన(కెప్టెన్), జార్జియా వోల్, గౌతమి నాయక్, రిచా ఘోష్(కీపర్), రాధా యాదవ్, నదీన్ డి క్లర్క్, అరుంధతి రెడ్డి, సయాలీ సత్‌ఘరే, శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్.