
భారత జట్టుకు ఓ శుభవార్త అందింది. గాయం కారణంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టి-20 సిరీస్‌కి దూరమైన తిలక్ వర్మ తిరిగి కోలుకుంటున్నాడని తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగే చివరి టి20 నాటికి (జనవరి 31) తిలక్ అందుబాటులో ఉంటాడని సమాచారం. అలాగే టి-20 ప్రపంచకప్‌లో కూడా అందుబాటులో ఉండనున్నాడట. ఈ వార్త భారత శిబిరం, అభిమానుల్లో ఆనందాన్ని రేకెత్తిస్తోంది. అయితే టీం ఇండియా అతడిని కివీస్‌తో జరిగే టి-20 ప్రపంచకప్‌లో ఆడించడం కన్నా.. టి-20 ప్రపంచకప్‌లో అతడి సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్నారట. ప్రస్తుతం తిలక్ వర్మ బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
తిలక్ వర్మకు గాయం కావడంతో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చాడు. కానీ, అతడు తొలి మూడు మ్యాచ్‌లు విఫలమయ్యాడు. ఇప్పుడు నాలుగో టి-20లో సంజూకు మరో అవకాశం దక్కనుంది. ప్రస్తుతం అతడు ఇషాన్ కిషన్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురుకుంటున్నాడు. ఆసియా కప్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన అలాగే గాయానికి ముందు తిలక్ ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే అతడి స్థానానికి ఢోకా లేదని తెలుస్తోంది.