Reading Time: < 1 minute

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై గట్టిగా మాట్లాడితే తమపై బూతులు మాట్లాడుతున్నారని.. కేసులు పెడుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. ఎన్నికలకు వెళ్లడానికి కాంగ్రెస్ కు భయమెందుకు? అని ప్రశ్నించారు. కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి లోకి చేవెళ్ల నేతలు చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజంగా మీరు మంచి చేస్తే చేవెళ్లలో ఎన్నికలకు వెళ్దామని పిలుపు నిచ్చారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ పరిస్థితి ధృతరాష్ట్రుడిలా మారిందని, పార్టీ మారిన వాళ్లు కళ్ల ముందు కనిపిస్తున్నా.. ఎవరూ పార్టీ మారలేదని తీర్పులిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న జర్నలిస్టులను కూడా ఇబ్బంది పెడుతున్నారని కెటిఆర్ ధ్వజమెత్తారు.