
హైదరాబాద్: కామారెడ్డి జిల్లా బోర్లం గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ పర్నీచర్ తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ఆటోలోంచి కిందపడి 8వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. విద్యార్థినులతో పనులు చేయించిన ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి కుటుంబ సభ్యులు పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.