Reading Time: < 1 minute

మాస్ మహరాజ రవితేజా ఇటీవలే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా బాక్సపీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. ఈ సినిమా తర్వాత రవితేజ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు. రవితేజ, విఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, రవితేజ పుట్టనరోజు సంద్భంగా ఈ సినిమా టైటిల్, పోస్టర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ పోస్టర్‌లో రవితేజా అయ్యప్ప మాలలో తలపై ఇరుముడితో ఓ చిన్న పాపని ఎత్తుకొని కనిపిస్తున్నారు. ఈ సినిమాకి కూడా ‘ఇరుముడి’ అని టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ‘‘కొన్ని కథలు జీవితంలో సరైనా సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి ఒక కథే ఈ ఇరుముడి. ఇందులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా . కొత్త ప్రయాణంలో ఉత్సాహం’’ రవితేజ రాసుకొచ్చారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా.. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.