Reading Time: < 1 minute

ఇస్లామాబాద్: పని మనిషిపై పాక్ మాజీ క్రికెటర్ కుమారుడు అత్యాచారం చేశాడు. దీనికి సంబంధించిన వార్త సోసల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ అబ్ధుల్ ఖాదిర్‌కు సల్మాన్ ఖాదిర్ అనే కుమారుడు ఉన్నాడు. తన ఇంట్లో పని చేసే మహిళను పని ఉందని ఫార్మ్‌హౌస్‌కు తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పాకిస్థాన్ పీనల్ కోడ్ 376 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్తాన్‌లో క్రికెట్‌లో గొప్ప లెగ్ స్పిన్నర్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. కుమారుడిపై అత్యాచారం చేసిన ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.