
ఢిల్లీ: కర్తవ్యపథ్ లో జాతీయజెండా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆవిష్కరించారు. దేశ రాజధాని ఢిల్లీలో 77 వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్యపథ్ లో సైనికుల గౌరవవందనం స్వీకరించారు. ‘వందేమాతరానికి 150 ఏళ్లు’ ప్రధాన ఇతి వృత్తంతో కర్తవ్యపథ్ గణతంత్ర వేడుకల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు. వేడుకల్లో కేంద్రమంత్రులు.. ముఖ్య అతిధిగా ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్డడెర్ లేయెన్ పాల్గొన్నారు. రాష్ట్రపతి శుభాంశు శుక్లాకు అశోకచక్ర పురస్కారం ప్రధానం చేశారు. 4 ఎంఐ-17 హెలికాప్టర్లు వేడుకలపై పూలవర్షం కురిపించాయి. జెండా ఆవిష్కరణ తర్వాత సైనిక, రక్షణ దళాల కవాతు. ఐరోపా సమాఖ్యకు చెందిన సైనిక బృందం పరేడ్ లో పాల్గొన్నాయి. యుధ్ధవిమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు వివిధ విభాగాలకు చెందినవి. 16 యుద్ధ విమానాలు, 9 హెలికాప్టర్లు, కార్గో విమానాలు, రాఫేల్, సుఖోయ్, మిగ్-29, జాగ్వార్ విమానాలు, అర్జున్, వజ్రాంగ్, వరుణ, విజయ్ వంటి ఫార్మేషన్ల దళాలు విన్యాసాలు చేశాయి. ఆపరేషన్ సిందూర్ ఆయుధ వ్యవస్థను త్రివిధదళాలు, వివిధ విభాగాలకు చెందిన 30 శకటాల ప్రదర్శించాయి. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు శకటాలు చెందినవి. కేంద్రమంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 13 శకటాలు ప్రదరర్శనలు చేశాయి.