
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రం పెద్ది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఇప్పటివరకు కనిపించని కొత్త లుక్‌లో దర్శనమిస్తున్నారని ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ స్పష్టంచేశాయి. ముఖ్యంగా ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ హైలైట్‌గా నిలవనున్నాయని టాక్. ఈ క్రమంలో విడుదలైన ‘చికిరి చికిరి’ పాట సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి ఐదు భాషలలో 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. ‘చికిరి చికిరి’ పాట తెలుగు వర్షన్ సాంగ్ 150 మిలియన్ వ్యూస్ ని దాటేసింది.
ఇక ఈ సినిమా నుంచి నెక్ట్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్న వారికి క్రేజీ బజ్ వినిపిస్తోంది.ఈ సాంగ్‌పై ఓ క్లారిటీ నెలాఖరుకి రానున్నట్టు తెలుస్తోంది. ఇది సాలిడ్ మాస్ నెంబర్ అని తెలిసిందే. ఇక దీనితో పాటుగా ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుంది అని దానికి మృణాల్ ఠాకూర్ కావాలంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. కానీ అది మృణాల్ ఠాకూరా కాదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఓ స్టార్ హీరోయనే ఉండొచ్చని తెలుస్తోంది. ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సమర్పించిన ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్. మార్చి 27న పెద్ది గ్రాండ్ పాన్-ఇండియా థియేట్రికల్ రిలీజ్ కాబోతుందని మేకర్స్ ప్రకటించారు.