Reading Time: < 1 minute

తమన్నా భాటియా తన బాయ్ ఫ్రెండ్, హీరో విజయ్ వర్మతో బ్రేకప్ చెప్పుకున్న తర్వాత కసిగా సినిమాలు సైన్ చేస్తోంది. ఆమె మునుపటి కన్నా మరింత అందంగా, స్టయిలీష్‌గా కనిపిస్తోంది. దాంతో, ఆమె ఫొటోలు చాలా వేగంగా వైరల్ అవుతున్నాయి. ఇక బాలీవుడ్‌లో కూడా ఆమె కెరీర్ సూపర్‌గా సాగుతోంది. ఇప్పటికే ఆమె ఐటమ్ గర్ల్‌గా బాలీవుడ్‌లో కొత్త రికార్డులు సృష్టించింది. ఇక ఇప్పుడు దాదాపు అరడజను బడా చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు చేస్తోంది. ప్రత్యేక గీతాల్లోనూ దర్శనం ఇవ్వనుంది. తమన్నాకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు కానీ బాలీవుడ్‌లో మాత్రం ఆమెకి క్రేజ్, డిమాండు ఎక్కువగా ఉంది. ఆమె డ్యాన్స్‌లు హిందీ ప్రేక్షకులను మతి పోగొడుతున్నాయి. తెలుగు వాళ్లకు ఆమె సూపర్ డ్యాన్సర్ అని తెలుసు. కానీ నార్త్ వాళ్లకు ఇటీవలే తెలిసింది. అందుకే ఆమె పాటలకు, డ్యాన్సులకు యమా క్రేజ్ పెరిగింది. మొత్తమ్మీద ఈ భామ పెళ్లి, ప్రేమ విషయాలు పక్కన పెట్టి కెరీర్‌పై దృష్టి పెట్టింది. స్టయిల్, హాట్ విషయంలో అదరగొడుతోంది.