
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 17 మంది రాష్ట్రపతి సేవా పతకాలకు ఎంపిక కాగా, ఐఎస్‌డబ్లూ ఇంటెలిజెన్స్ అడిషినల్ ఎస్పి ఎం.జి.ఎస్. ప్రకాష్ రావు, ఇంటెలిజెన్స్ సబ్ ఇన్స్‌పెక్టర్ అన్ను.దామోదర్ రెడ్డి లు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు ఎంపిక అయ్యారు. ఇక మెడల్ ఫర్ మెరిటేరియస్ సర్వీసెస్ అవార్డుకి 14 మంది ఎంపిక కాగా వారిలో ఎస్‌ఐబి ఐజిపి సుమతి, కమాండెంట్ పి. వెంకట రాములు, అడిషనల్ కమాండెంట్ అట్లూరి బాను మూర్తి, సిఐడి డిఎస్పి ఎ. శంకర్, టిజిసిఎస్‌బి డిఎస్పి కె.వి.ఎం. ప్రసాద్, పిసిఎస్‌అండ్‌ఎస్ డిఎస్పి సి. వంశీమోహన్ రెడ్డి, పిటిసి డిఎస్పి టి.లక్ష్మి, టిజిఎస్‌పి ములుగు జిల్లా చలవాయి ఐదవ బెటాలియన్‌కు చెందిన వి. పురుషోత్తమ రెడ్డి,
రాజన్న సిరిసిల జిల్లా వేములవాడ ఎస్‌ఐగా పనిచేస్తున్న బి. ఎల్లయ్య, ఇంటెలిజెన్స్ ఎస్‌ఐ సయ్యద్ అబ్దుల్ ఖరీం, జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న బి. ఆనందం లు ఎంపియ్యారు. హోంగార్డుల విభాగం నుండి ముగ్గురు ఎంపిక కాగా, వారిలో బుర్రనోళ్ల. రేణుక, మాసరం.రవి, పిట్టకల. జంగయ్యలు ఉన్నారు. ఇక గ్యాలెంటరీ అవార్డు సైబరాబాద్ హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకట్ రెడ్డికి లభించింది. అవార్డుల పొందిన అధికారులను డిజిపి బి. శివధర్ రెడ్డి అభినందించారు. పోలీస్ శాఖకు ఇన్ని పతకాలు రావడం అధికారులు వృత్తి పట్ల చూపిస్తున్న నిబద్దతకు నిదర్శనమన్నారు. భవిష్యత్తులో సైతం ఇదేవిధంగా విధులు నిర్వహించి మరిన్ని పతకాలు పొందాలని అకాంక్షించారు.