Reading Time: < 1 minute

హైదరాబాద్: నాంపల్లిలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. అఖిల్(7), ప్రణీత (11), హబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబి (43) ఈ ఘటనలో మృతి చెందినట్లు ఫైర్ డిజి విక్రమ్ సింగ్ మాన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆదివారం ఫర్నీచర్ షాపు యజమాని సతీశ్ బచానిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అగ్నిప్రమాద ఘటనలో చనిపోయిన పిల్లల తండ్రి యాదయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సతీశ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం విషయానికొస్తే.. సెల్లార్‌లో ఫర్నీచర్, కెమికల్స్ నిల్వ ఉంచడంతో బాధితులు మెట్ల మార్గంలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నించారు. ఐరన్ షట్టర్‌కు తాళం వేయడంతో బాధితులు బయటకి రావడం కష్టమైదని ఫైర్ డిజి తెలిపారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని స్పష్టం చేశారు.