Reading Time: < 1 minute

గువాహటి: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా బర్సపరా స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టి-20లో భారత బౌలర్లు రాణించారు. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కి ఆరంభంలోనే హర్షిత్ రాణా షాక్ ఇచ్చాడు. తొలి ఓవర్ మూడో బంతికి కాన్వే(1) ఔట్ చేశాడు. ఆ తర్వాత హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో రచిన్ రవీంద్ర(4) పెవిలియన్ చేరాడు. అనంతరం బుమ్రా బౌలింగ్‌లో సీఫర్ట్(12) తన వికెట్‌ని కోల్పోయాడు. ఈ నేపథ్యంలో కష్టాల్లోపడిన జట్టుకి ఫిలిప్స్, ఛాప్‌మెన్ల జోడీ అండగా నిలిచింది. భారత బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ.. పరుగులు రాబడుతున్నారు. దీంతో 11 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఫిలిప్స్(35), ఛాప్‌మెన్(30) ఉన్నారు.