
ఎబిఎన్ , ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలను బహిష్కరిస్తూ బిఆర్‌ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణ భవన్‌లోకి కానీ, జిల్లా పార్టీ కార్యాలయాల్లో కానీ జరిగే సమావేశాలకు ఎబిఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి ప్రతినిధులకు అనుమతి ఉండదని, అలాగే ఆ ఛానల్ టీవీ చర్చల్లో తమ నేతలు పాల్గొనరాదని బహిరంగంగా ప్రకటించింది. ఈ మేరకు బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు, ఎంఎల్‌సి తక్కెళ్లపల్లి రవీందర్ రావు పట్ల ఎబిఎన్ ఛానెల్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే రాష్ట్ర నాయకత్వం పట్ల ఆంధ్రజ్యోతి అసభ్యకరంగా వ్యవహరించిన చరిత్ర ఉందని కూడా పార్టీ ఆరోపించారు. ఎంఎల్‌సి తక్కలపల్లి రవీందర్ రావుపై వ్యాఖ్యలపై జర్నలిస్ట్ వెంకటకృష్ణ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.